![]() |
![]() |

సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేశ్ పలు చిత్రాల్లో ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్నారు. వాటిలో `సూర్యవంశం` ఒకటి. తమిళ చిత్రం `సూర్యవంశం` (1997) ఆధారంగా రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో హరిశ్చంద్ర ప్రసాద్, భాను ప్రసాద్ గా తండ్రీకొడుకుల పాత్రల్లో అలరించారు వెంకీ. అతనికి జోడీగా రాధిక, మీనా నటించిన ఈ సినిమాలో సంఘవి, ఆనంద్ రాజ్, సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, సుధాకర్, మల్లికార్జున రావు, నూతన ప్రసాద్, అలీ, రాజా రవీంద్ర, మహర్షి రాఘవ, బెనర్జీ, అశోక్ కుమార్, వర్ష, సత్యప్రియ, సన, రజిత, అనూజ, మాస్టర్ ఆనంద్ వర్ధన్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. రీమేక్ చిత్రాల స్పెషలిస్ట్ భీమనేని శ్రీనివాసరావు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
ఎస్.ఎ. రాజ్ కుమార్ పాటలు, నేపథ్య సంగీతం `సూర్యవంశం`కి ఎస్సెట్ గా నిలిచాయి. ``రోజావే చిన్ని రోజావే`` (మూడు వెర్షన్స్), ``కిలకిల నవ్వే``, ``చుక్కలన్నీ ముగ్గులై``, ``అడుగో మహరాజు``, ``ఝలక్ ఝలక్``.. ఇలా ఇందులోని పాటలన్నీ ఆకట్టుకున్నాయి. సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్. బి. చౌదరి నిర్మించిన ఈ మ్యూజికల్ బ్లాక్ బస్టర్.. 1998 ఫిబ్రవరి 25న జనం ముందు నిలిచింది. నేటితో `సూర్యవంశం` 24 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |